17న ‘మధ్యాహ్న’ కార్మికుల వంటావార్పు
ఆసిఫాబాద్‌అర్బన్: సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వెలిశాల కృష్ణమాచారి తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం డీఈవో కార్యాలయంలో నోటీసు అందించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు, కోడిగుడ్లకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి మాయ, నాయకులు మడావి చంద్రకళ, పద్మ, ఉర్మిళ, సునీత ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment