18 నుంచి డీఈడీ పరీక్షలు
ఆసిఫాబాద్‌రూరల్: ఈ నెల 18 నుంచి 24 వరకు డీఈడీ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు 20 నిమిషాల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
తేనెటీగల పెంపకంతో ఆర్థిక ప్రగతి
జైనూర్(ఆసిఫాబాద్): వ్యవసాయంతోపాటు తేనెటీగల పెంపకంపై దృష్టి సారిస్తే రైతులు ఆర్థిక ప్రగతి సాధించవచ్చని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంస్థ సభ్యురాలు త్రివేణి అన్నారు. జైనూర్ మండలం జంగాంలో తేనెటీగల పెంపకం కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ గత నెలలో అవగాహన కల్పించి రైతులకు తేనెటీగల బాక్సులు అందించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment