లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): వార్షిక లక్ష్య సాధనకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో శుక్రవారం మల్టీ డిపార్టుమెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ యాజమాన్యం ఏరియాకు నిర్దేశించిన వార్షిక లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సింగరేణి సంస్థ గతంలో సాధించిన లక్ష్యాలతోపాటు భవిష్యత్తులో లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలను ఉద్యోగులు, అధికారులకు వివరించారు. పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, ఉద్యోగులు, యంత్రాల పనితీరు గణాంకాలను వివరించారు. సంస్థ పురోభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రతిభ చూపిన నలుగురు ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్, ఎస్‌వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజనీరు భీంరావు జాడే, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఫైనాన్స్ మేనేజర్ రవి, గుర్తింపు సంఘం నాయకులు శేషశయన రావు, ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment