చిట్టినగర్(విజయవాడపశ్చిమ): జక్కంపూడి సమీపంలోని పోలవరం కాలువలో ఇద్దరు బాలురు ఘల్లంతైన ఘటన శుక్రవారం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు బాలురు స్నానం చేసేందుకు జక్కంపూడి సమీపంలోని పోలవరం కాలువకు వెళ్లారు. అయితే వారిలో సింగ్‌నగర్‌కు చెందిన ఎండీ. మునీర్(18), శివ తేజ(18) గల్లంతు కాగా, మిగిలిన నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ఇద్దరు బాలురు ఆచూకీ కోసం కొత్తపేట పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment