సిబ్బంది సంక్షేమమే లక్ష్యం
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: జిల్లాలోని ఏఆర్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖలోని ఆర్మడ్ రిజర్వ్, హోంగార్డ్స్ సిబ్బందికి శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్‌ఐ సతీష్ కుమార్ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. తొలుత ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ ప్లటూన్ల వారీగా ఇన్‌స్పెక్షన్ చేసి, సిబ్బంది టర్న్ అవుట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థకు ఏఆర్ విభాగం వెన్నెముక లాంటిదని, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తినప్పుడు ఏఆర్ సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించి అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండాలన్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన, పోలీస్ శాఖ ప్రతిష్టకు కళంకం తెచ్చే విధంగా సిబ్బంది వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సిబ్బంది సమస్యల పరిష్కారానికి దర్బార్ నిర్వహించిన ఎస్పీ.. సమస్యలను ఆలకించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. అలాగే వృత్తిపరంగా ఏవైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్ డేలో తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, ఏఆర్‌డీఎస్ పి. వెంకటేశ్వరరావు, ఆర్‌ఐలు, ఏఆర్ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment