శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ అందరివీ పని ఒత్తిళ్లతో ఉరుకుల పరుగుల జీవితాలు అయిపోయాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిదీ యాంత్రిక జీవనం అయిపోయింది. ఆర్థిక లావాదేవీలతో వ్యాపారులు, చదువులతో విద్యార్థులు, పోటీ పరీక్షలతో నిరుద్యోగులు, ఇంటి పనులతో గృహిణులు, విధి నిర్వహణతో ఉద్యోగులు నిరంతరం బిజీ..బిజీ.. ఈ హర్రీబుర్రీ జీవన శైలితో ఒత్తిళ్లకు గురై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో చాలామంది చైతన్యవంతులై ఉదయం, సాయంత్రం నడక బాట పడుతున్నారు. తమకు డాక్టర్లు రాసిచ్చిన మందులతో పాటు నడకతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందనే వైద్యుల సలహాలను కూడా పాటిస్తున్నారు.
నడక వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. పదేళ్లుగా వాకింగ్ చేస్తున్నా. రోజుకు 40 నుంచి 60 నిమిషాల వరకు నడుస్తాను. నడక వలన కలిగే ప్రయోజనాలను మేము కొత్తగా వాకింగ్‌కు వచ్చే వారికి వివరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నడవటం అలవాటు చేసుకుంటే రోగాలు దరి చేరవు.
– పోలవరపు వెంకట్రావు,
లయన్స్ మాజీ చైర్మన్
న్యూస్‌రీల్
మనసు ప్రశాంతంగా..
నలుగురితో నడక.. ఆనందంతో పాటు ఆరోగ్య ప్రాప్తి జీవన శైలిలో మార్పులతో ఆయుష్షు పెరుగుదల ఆధునిక సమాజంలో నడకకు పెరుగుతున్న ప్రాధాన్యం
తప్పనిసరిగా నడుస్తాం
Comments
Please login to add a commentAdd a comment