No Headline
గుడ్లవల్లేరు: అనారోగ్యంతో డాక్టర్ వద్దకు వెళ్తే ముందుగా వాకింగ్‌కు వెళ్తున్నారా...అని అడిగిన తర్వాతనే వైద్యం చేస్తున్నారు. దీనిని బట్టి నడకకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్ధం అవుతుంది. 20 ఏళ్ల వరకు కళాశాలలు, మైదానాల్లో పెద్దవారు వాకింగ్, యువకులు జాగింగ్ చేసేవారు. అలా చేసేది కూడా ఆర్థికంగా స్థితిమంతులు, భారీ ఉద్యోగులు మాత్రమే. కాని ప్రస్తుతం కాలం మారింది. ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. అవకాశం ఉన్న ప్రతి చోట నలుగురు కలిసి నాలుగు అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గుడ్లవల్లేరు లాంటి మినీ టౌన్‌లో కూడా వాకర్స్ సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడం గమనార్హం. ఇక్కడ నడకదారులంతా కలసి గుడ్లవల్లేరు వాకర్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఆరేళ్లుగా ఈ అసోసియేషన్‌ను నడిపించటమే కాకుండా ఆపదలో ఉన్న పేదలకు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ అసోసియేషన్‌లో వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంకు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఒకరేమిటి ఎన్నో రంగాలకు చెందిన వారంతా ఇందులో ఉన్నారు. నడక అనేది దినచర్యలో భాగం కావాలన్న నినాదంతో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలను నూతనంగా చేరిన సభ్యులకు వివరిస్తున్నారు. గతంలో రైల్వేస్టేషన్, పెంజెండ్ర, గుడ్లవల్లేరు, కౌతవరం, కూరాడ రహదారుల వెంబడి వాకింగ్ చేసేవారు. అనంతరం వాకర్స్ ఆసక్తికి అనుగుణంగా స్థానిక ఎస్‌ఈఆర్‌ఎం హైస్కూల్ ప్రాంగణంలో కొన్నాళ్ల క్రితం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment