ఆర్‌పీఎఫ్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు విజ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ ఆర్‌పీఎఫ్ క్రికెట్ టోర్నమెంట్ విజయవాడలోని రైల్వే స్టేడియంలో ఈ నెల 20 నుంచి జరిగాయి. ఈ టోర్నమెంట్‌లో జోన్‌లో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు, ఎస్‌సీఆర్ హెడ్ క్వార్టర్స్ జట్లు పాల్గొన్నాయి. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన గుంతకల్లు, హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఇరు జట్లు 20 ఓవర్‌లకు 178 పరుగులు చేసి స్కోరును సమం చేసి డ్రాగా ముగించాయి. దీంతో రెండు జట్ల మధ్య రెండు సూపర్ ఓవర్‌లను నిర్వహించగా, అందులో హైదరాబాద్ జట్టు విజయం సాధించి ట్రోఫీ కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు వేడుకల్లో విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ పాల్గొని విజేత జట్టును అభినందించారు. అనంతరం విజేత జట్టు క్రీడాకారులకు పతకాలను అందజేసి జట్టు కెప్టెన్ డి.ప్రవీణ్‌కు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీఎస్‌సీ బి.ప్రశాంత్ కుమార్, ఏఎస్‌సీ మధుసూదన్, ఏఓఎం పి.రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
స్మార్ట్ ఎనర్జీ మీటర్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నిరుద్యోగ యువతకు స్మార్ట్ ఎనర్టీ మీటర్ (విద్యుత్ మీటర్) టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జి. పవన్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పది(పాస్/ఫెయిల్), ఐటీఐ, ఆపైన విద్యార్హత కలిగిన వారు, ఎలక్ట్రికల్ వర్క్‌లో అనుభవం ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వారు ఈ శిక్షణకు అర్హులని తెలియజేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని, మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 78428 17348, 63027 20740లో సంప్రదించాల్సిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment