రాబోయే తరానికి క్రీడా యాప్ దిక్సూచి
విజయవాడస్పోర్ట్స్: క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందించే దిశగా రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు చేపడుతున్నామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. క్రీడా యాప్, క్రీడా పాలసీని విజయవాడలోని ఓ హోటల్లో మంత్రి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా సంఘాలకు, క్రీడాకారులకు, క్రీడా పోటీల సమాచారానికి సంబంఽధించిన సమగ్ర సమాచారాన్ని అందించే దిశగా యాప్ను రూపొందించామన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని, రాబోయే కాలంలో క్రీడాకారుల భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. క్రీడా శాఖలో పారదర్శకత కోసమే ఈ యాప్ను క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నకిలీ క్రీడా సర్టిఫికెట్లను నిలువరించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, క్రీడా శాఖ కార్యదర్శి వినయ్ చంద్, శాప్ ఎండీ గిరీషా, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, కరాటే క్రీడాకారిణి పూజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment