కంచికచర్ల మండలం చెవిటికల్లు నుంచి కంచికచర్ల అంబేడ్కర్ సెంటర్ వరకు 8.7కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్డును విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేసిందని ఆర్ అండ్ బీ డీఈఈ శశిభూషణ్ శుక్రవారం తెలిపారు. సెంట్రల్ రోడ్డు ఫండ్ కింద రూ. 11కోట్లు మంజూరయ్యాయన్నారు. రోడ్డు పక్కన ఆక్రమణలు తొలగించాలని రెండుసార్లు నోటీసులు ఇచ్చామని అయినా వారు తొలగించలేదన్నారు. తామే స్వయంగా జేసీబీ, పొక్లెయిన్‌లతో తొలగించే పనులు చేపట్టామన్నారు. రోడ్డు పక్కన కట్టుకున్న లబ్ధిదారులు తమ ఇళ్లను తొలగించవద్దని వినతిపత్రం అందజేశారని తెలిపారు. దీన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తామని డీఈఈ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment