కుల పెద్దల మాట వినడం లేదని కుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

కుల పెద్దల మాట వినడం లేదని కుల బహిష్కరణ

Published Fri, Sep 27 2024 2:16 AM | Last Updated on Fri, Sep 27 2024 2:16 AM

-

పాలకుర్తి టౌన్‌: కుల పెద్దల మాట వినడం లేదని ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు గ్రామానికి చెందిన రిటైర్ట్‌ పోస్టుమాస్టర్‌ జ్యోతి సోమయ్య తల్లి పది రోజుల కిత్రం మృతి చెందింది. దహన సంస్కారాల అనంతరం తల్లి దశదినకర్మకు ఎవరూ వెళ్లకూడదని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. వెళ్లిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించడంతో ఆ కుటుంబం వైపు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కన్నెత్తి చూడలేదు.

అసలు పంచాయితీ ఇదీ..

సోమయ్యకు తన తోడబుట్టిన వ్యక్తులతోపాటు పాలివారితో కొద్ది సంవత్సరాలుగా భూమి పంచాయితీ నడుస్తోంది. ఈ విషయం కులపెద్దల మాట వినడం లేదని ఈ నెల 22వ తేదీన సోమయ్య కుటుంబాన్ని బహిష్కరించారు. ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూడకూడదని, మాట్లాడకూడదని కుల పెద్దలు ఆదేశించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సోమయ్య ఈ నెల 23వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పాలకుర్తి ఎస్సై సాయి ప్రసన్నకుమార్‌ను వివరణ కోరగా గూడూరు గ్రామానికి చెందని జ్యోతి సోమయ్య కుల బహిష్కరణ చేశారని బాధితుడి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బాధితుడు సోమయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

పోలీస్‌ సేష్టన్‌లో బాధితుడి ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement