మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ ఉన్నతాధికారులు శిక్షణ పూర్తి చేసుకున్న 142మంది నూతన కానిస్టేబుళ్లను జిల్లాకు కేటాయించారు. ఈమేరకు పీసీలు గురువారం అర్ధరాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేశా రు. జిల్లాకు కేటాయించిన వారిలో 96 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 46 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఏఆర్ విభాగంలో 34 మంది పురుషులు, 12 మంది మహిళా కానిస్టేబుళ్లు, సివిల్ విభాగంలో 59 మంది పురుషులు, 37 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి వారు విధులకు హాజరుకానున్నారు. కాగాజిల్లాలోని ఒక్కో స్టేషన్కు కొంత మంది చొప్పున కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఆయా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత తీరనుండడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి.
తీరనున్న పోలీసు సిబ్బంది కొరత
Comments
Please login to add a commentAdd a comment