ధాన్యం వివరాలు నమోదు చేయాలి
మరిపెడ/మరిపెడ రూరల్: ప్రతీరోజు ధాన్యం కొనుగోళ్లు, రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం మండలంలోని తండధర్మారం, పురుషోత్తమాయగూడెం, అబ్బాయిపాలెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లోని రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వ సూచనల ప్రకారం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలన్నారు. అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని కలెక్టర్ పరిశీలించారు. క్షేత్రాస్థాయిలో సేకరించిన వివరాలను తప్పులు దొర్లకుండా నమోదు చేయాలన్నారు. కలెక్టర్ వెంట సీఈఓ పురుషోత్తం, మరిపెడ తహసీల్దార్ సైదులు, మండల వ్యవసాయ శాఖ అధికారి వీరసింగ్, ఎంపీడీఓ విజయ, ఎంపీఓ సోమలాల్, పీఏసీఎస్ సీఈఓ నరేష్ పాల్గొన్నారు.
వసతి గృహాలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మహబూబాబాద్ అర్బన్: వసతి గృహాలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సంబంధిత అధికారులతో వసతి గృహాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకాధికారులు మండలాల్లో సందర్శించాలని, లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. చలికాలంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలన్నారు. హాస్టళ్లలో రాత్రివేళ నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని, పాములు, విష పురుగులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు గణేష్, కృష్ణవేణి, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజ్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీసీఓ వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, అధికారులు సురేష్, మరియన్న, విజయనిర్మల, సైదా పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలి
జిల్లాలో త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, కొనుగోళ్ల పూర్తి వివరాలు తెలియజేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంలు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment