లేఖల్లో ఏం పేర్కొన్నారంటే..
ఇద్దరిని చంపిన స్థలంలో కార్యదర్శి శాంత, భారత కమ్యూనిస్టు పార్టీ పేరిట మావోయిస్టులు రెండు లేఖలను వదిలివెళ్లారు. ఆ లేఖల్లో.. ‘ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఉయికె రమేశ్, ఉయికె అర్జున్ పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారు. గుట్టలపై ఉన్నప్పుడు పార్టీ కదలికలను వారి అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు పసిగడుతూ పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. క్రమంగా ఎస్‌ఐబీ కంట్రోల్‌కి వెళ్లి పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బార్డర్‌లో ఉన్న గ్రామాలైన లంకపెల్లి, జన్నపు, ఊట్ల, శ్యామల దొడ్డి, వాయిపేటలతోపాటు చుట్టు పక్కల గ్రా మాల్లో బంధువులు, స్నేహితుల ద్వారా సమాచారం సేకరించి పోలీసులకు చెప్పేవారు. మావోయిస్టులపై కొన్ని దాడులకు కారకులయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చి వాజేడు మండలంలో ఉంటున్నారు. చేపల వేట, పశువుల మేతకోసమని అడవిలోకి వచ్చి సమాచారం సేకరిస్తూ పోలీసులకు చేరవేస్తున్నారు. పెనుగోలు గ్రామస్తులు గుట్టపై ఉండొద్దని ఒత్తిడి చేసి దింపారు. పద్ధతులు మార్చుకోవాలని చెప్పినప్పటికీ వినలేదు. అందుకే రమేశ్, అర్జున్‌ను ఖతం చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment