
నాడీ వ్యవస్థ త్వరగా చెడిపోతుంది
మత్తుకు బానిస అవుతున్న యువకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణ గంజాయి కన్నా.. ఆశీష్ ఆయిల్ పదిరెట్లు ఎక్కువ శక్తివంతమైనది. దీనికి బానిసైతే.. కోలుకోవడం కష్టం. ముందు నాడీ వ్యవస్థ, తర్వాత లివర్, కిడ్నీ, గుండె, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది. దీనికి బానిసైనవారు రెండు, మూడు సంవత్సరాల్లో చనిపోయే ప్రమాదం ఉంది.
– డాక్టర్ వీరమల్ల మాధవరావు, ప్రొఫెసర్,
ప్రభుత్వ మెడికల్ కళాశాల, మహబూబాబాద్