ప్రతిపాదనలు సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలు సిద్ధం చేయండి

Published Fri, Sep 27 2024 1:16 AM | Last Updated on Fri, Sep 27 2024 1:16 AM

ప్రతిపాదనలు సిద్ధం చేయండి

పాలమూరు: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన వయోవృద్ధుల క్లినిక్‌ను ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ ప్రారంభించారు. అనంతరం సూపరింటెండెంట్‌ గదిలో ఎమ్మెల్యే వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని, ఆ భవనం నిర్మాణానికి మరో రూ.12 కోట్ల బడ్జెట్‌ అవసరం అవుతుందని తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం చేసుకునే వరకు జనరల్‌ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించాలని, ఈ క్రమంలో ప్రస్తుతం ఆస్పత్రిలో మరమ్మతులు అవసరమైతే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ, భవనం లీకేజీ, టాయిలెట్స్‌, పడకలు, డోర్లు, కంప్యూటర్లు.. ఇలా అన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేసి ఇవ్వాలన్నారు. ప్రజలకు పూర్తిగా నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి వైద్యులు కృషి చేయాలని సూచించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌ మూడు రోజుల వ్యవధిలో ఆస్పత్రిలో అన్ని విభాగాలు పరిశీలించి కావాల్సిన సౌకర్యాలపై నివేదిక తయారు చేస్తామని ఎమ్మెల్యేకు తెలిపారు. సమావేశంలో ఆర్‌ఎంఓలు జరీనా, శిరీష, దుర్గా, డాక్టర్‌ సునీల్‌, ఆస్పత్రి అభివృద్ది కమిటీ సభ్యుడు రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

వారంలో రెండు రోజులు..

ఈ క్లినిక్‌లో 60 ఏళ్లు పైబడిన వారందరికీ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు. ప్రతి వారంలో రెండు రోజులు (మంగళ, గురువారం) వైద్యులు అందుబాటులో ఉండి పరీక్షలు చేస్తారు. ఆ రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. మొదట ఓపీ తీసుకున్న వృద్థులు క్లినిక్‌ గది దగ్గకు వెళితే అక్కడ జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు పరీక్షించి వారి సమస్య తెలుసుకుని సదరు విభాగం వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లి వైద్యసేవలు అందిస్తారు. అన్ని రకాల రక్త, మూత్ర, స్కానింగ్‌లు ఇతర పరీక్షలు సైతం చేస్తారు.

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి: ఎమ్మెల్యే యెన్నం

జనరల్‌ ఆస్పత్రిలో వయోవృద్ధుల

క్లినిక్‌ ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement