అక్రమ నిర్మాణదారులకు నోటీసులు అందజేత | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణదారులకు నోటీసులు అందజేత

Published Fri, Sep 27 2024 1:18 AM | Last Updated on Fri, Sep 27 2024 1:18 AM

-

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని పెద్దచెరువు చుట్టుపక్కల అక్రమంగా నిర్మించుకున్న 29 మంది ఇళ్ల యజమానులకు తాజాగా మున్సిపల్‌ అధికారులు నోటీసులు అందజేశారు. నిబంధనలను అక్రమించినందున బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సరైన వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిలో మొత్తం 64 అక్రమంగా కట్టడాలు వెలిసినట్టు గతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ, మున్సిపల్‌ అధికారులు నిర్వహించిన సర్వేలో తేల్చారు. పూర్తి వివరాలను ఇటీవల ఉన్నతాధికారులను నివేదించినట్టు సమాచారం. వారి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో ఆక్రమణదారుల్లో గుబులు మొదలైంది. అలాగే పాలకొండలోని ఊరకుంట ఎఫ్‌టీఎల్‌ జోన్‌ పరిధిలో మరో 12 మంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టు ఈ సర్వేలో గుర్తించారు. ఈ విషయం ఇప్పుడు బయటకు పొక్కడంతో వారు గురువారం మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించడం గమనార్హం. సుమారు 25 ఏళ్ల క్రితం తాము అక్కడ చిన్న చిన్న ఇళ్లు, రేకుల ఇళ్లు ఏర్పాటు చేసుకున్నామని అందులో పేర్కొన్నారు.

పెద్దచెరువు పరిధిలో 29 మందిపైచర్యలకు రంగం సిద్ధం

దీని కింద ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ పరిధిలో64 అక్రమ కట్టడాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement