శ్రీఆంజనేయం..
మక్తల్: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. సాధారణంగా ప్రతి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహాలు తూర్పు ముఖమై ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారు పశ్చిమ (పడమటి) దిశకు కొలువుదీరి ఉండటం విశేషం. ఇలాంటి విగ్రహం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఆలయ గర్భగుడికి పైకప్పు లేకపోవడం విశేషం. గతంలో పైకప్పు నిర్మిస్తే బీటలువారి పడిపోయిందని పూర్వీకులు చెబుతున్నారు. సుమారు ఏడు అడుగులపైనున్న స్వామివారి భారీ విగ్రహం భూమిపై ఎలాంటి ఆధారం లేకుండా నిలబడి ఉండటం మరో విశేషంగా చెప్పవచ్చు.
ఫ మహబూబ్‌నగర్–రాయచూర్ అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారిని నిష్టతో 41 రోజుల పాటు కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలు, పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.
నేటి నుంచి పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలు
19వ తేదీ వరకు కొనసాగింపు
15న రథోత్సవం
ఏర్పాటు పూర్తిచేసిన నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment