బృహత్తర ప్రణాళికకు అవకాశం
ముడా పరిధిని జిల్లా మొత్తానికి విస్తరించినందున బృహత్తర ప్రణాళిక అమలు చేయడానికి వీలవుతుంది. ఆయా గ్రామాల అభివృద్ధితో పాటు జిల్లా కేంద్రానికి అనుసంధానం చేస్తూ రహదారుల నిర్మాణానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి స్మార్ట్ సిటీ, అమృత్ తదితర పథకాల ద్వారా భారీగా నిధులు అందుతాయి. ఇప్పటికే కొత్త లే–అవుట్ల ఏర్పాటు, బిల్డింగ్ అనుమతుల ద్వారా సుమారు రూ.20 కోట్లు సమకూరాయి. ఈ నిధులతోనే వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
– డి.మహేశ్వర్‌రెడ్డి, వైస్‌చైర్మన్, ముడా, మహబూబ్‌నగర్
కొత్త ప్రతిపాదనలు చేస్తాం
జిల్లావ్యాప్తంగా ముడా పరిధి విస్తరించినందున 3 మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామాల అభివృద్ధికి కొత్త ప్రతిపాదనలు చేస్తాం. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ఆయా ఎమ్మెల్యేల నుంచి కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించి ప్రక్రియ చేపడతాం. అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు యత్నిస్తాం. ఇప్పటివరకు కార్పస్ ఫండ్ రానేలేదు. వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ నుంచి కనీసం రూ.500 కోట్లు ఇవ్వాలని కోరతాం. ముఖ్యంగా కొత్త భవనం నిర్మించాల్సి ఉంది.
– కె.లక్ష్మణ్‌యాదవ్, ముడా చైర్మన్, మహబూబ్‌నగర్
●
Comments
Please login to add a commentAdd a comment