ఉత్సాహంగా అర్బన్‌స్థాయి సీఎం కప్ క్రీడలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం మున్సిపాలిటీ (అర్బన్ స్థాయి) సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 300 మంది పాఠశాలల విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. వీరికి అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్లను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు.
క్రీడాపోటీల ప్రారంభం
సీఎం కప్ అర్బన్ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, డీవైఎస్‌ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడాపోటీలు నిర్వహిస్తుందని, పోటీల్లో విద్యార్థులు ప్రతిభచాటాలని కోరారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షులు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, డీఎస్‌ఏ సూపరింటెండెంట్ రాజగోపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు బాలరాజు, విలియం, సాదత్‌ఖాన్, పరశురాం, రామేశ్వరయ్య, ప్రసన్నకుమార్, అరుణజ్యోతి, ఉమాదేవి, కురుమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment