నెలరోజుల వ్యవధిలోనే..
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో ఒక్క నెలలోనే మూడు పాఠశాలలు మూసివేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ మండలంలోని నర్సాయపల్లి, వెంకటగిరి, చౌటతండా పాఠశాలలను విద్యార్థులు లేరన్న కారణాలతో మూసేశారు. నర్సాయపల్లి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే.. అక్టోబర్‌లో ఇద్దరూ బదిలీపై వెళ్లిపోయారు. ఇక్కడ కొత్తగా ఉపాధ్యాయులను నియమించకపోగా.. విద్యార్థులే లేరంటూ బడిని మూసేశారు. వెంకటగిరిలోనూ ముగ్గురు విద్యార్థులు ఉన్నప్పటికీ ఇక్కడి టీచర్‌ను మరోచోట ‘సర్దుబాటు’ చేసి బడిని మూసేశారు. ఇప్పటికే అచ్చంపేట తెల్జిరిగుడిసెలు, గోపాల్‌రావునగర్ పాఠశాలలకు అధికారులు శాశ్వతంగా తాళం వేశారు.
Comments
Please login to add a commentAdd a comment