ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

Published Fri, Sep 27 2024 1:24 AM | Last Updated on Fri, Sep 27 2024 1:24 AM

ఐలమ్మ

జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి వినోద్‌కుమార్‌, రజక సంఘాల నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తికి సాగుతున్న పోరులో ఐలమ్మ చేరికతో భూమి కోసం భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, దేశ్‌ముఖ్‌ను ఎదురించిన వైనం మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల జిల్లా అధ్యక్షుడు తంగల్లపల్లి బాపు, రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశం, వివిధ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

బెటాలియన్‌లో..

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌లో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి బెటాలియన్‌ కమాండెంట్‌ వెంకటరాములు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ టి.కాళిదాస్‌, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ వెంకటరాములు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం1
1/1

ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement