● 24/7 విధుల్లోనే పోలీసులు ● కలగానే ఎనిమిది గంటల డ్యూటీ
పరేడ్‌లో పాల్గొన్న పోలీసులు(ఫైల్)
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం వి ధులు నిర్వర్తిస్తున్నారు. పండుగ రోజుల్లో, భార్యాపిల్లలతో కాస్త సమయం గడిపేందుకు తీరిక లేక పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు. పోలీసు అధికా రుల విధులకు సమయపాలన అంటూ ఉండ దు. లా అండ్ ఆర్డర్‌లో పని చేసే సిబ్బందికి ఉరుకులు పరుగులు మరీ ఎక్కువ. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తులు, కేసుల ద ర్యాప్తు, కోర్టులకు హాజరు కావడం, ఉన్నతా ధికారుల సమీక్షకు వెళ్లడం ఇలా బహుళ వి ధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏఆర్, టీ జీఎస్‌పీ సిబ్బందికీ తిప్పలు తప్పవు. పండుగలు, సభలు, సమావేశాలు, ప్రముఖుల బందోబస్తు అంటూ గంటల తరబడి నిలబడక తప్పదు. 24/7విధుల్లో ఉండాల్సి రావడంతో పోలీసులు శారీరక, మానసిక శ్రమకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. రక్తపోటు, మధుమేహం సర్వసాధారణం అవుతుండగా.. ప్రమాదకరమైన క్యాన్సర్, కిడ్నీ, బ్రెయిన్, గుండె జబ్బులతో ఆస్పత్రి పాలవుతున్నారు. వీటితోపాటు రోజువారీ విధి నిర్వహణలో మానసిక ఒత్తిడి సైతం అధికంగానే ఉంటోందని కొందరు పోలీసు అధికారులు వాపోతున్నారు.
పోలీసు శాఖ ఒక్కటే ఇలా..
ప్రభుత్వ రంగంలోని ఏ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకై నా వారంతపు(వీక్లీ ఆఫ్) సెలవులు ఉంటాయి. ఆ ఒక్క రోజు కుటుంబ సభ్యులతో వివిధ కార్యక్రమాల్లో ఉల్లాసంగా గడుపుతారు. ఏదో ఒక రకంగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. మిగతా రోజుల్లో సమయపాలన ఉంటుంది. కానీ పోలీసు శాఖలో ఉద్యోగులు 24గంటలు విధుల్లో ఉండాల్సిందే. పోలీసు ఉద్యోగంపై మక్కువతో చేరిన వారు ఆ తర్వాత ఒత్తిడితో ప్రత్యామ్నాయంగా ఇతర ఉద్యోగాల్లో చేరుతున్న వారూ ఉన్నారు. ఇటీవల కొందరు పోలీసులు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం గమనార్హం. ఎనిమిది గంటల పని విధానం, అదనంగా విధులు నిర్వర్తిస్తే అదనపు అలవెన్స్‌తోపాటు వారంతపు సెలవులు, ఇన్సెంటివ్‌లు కల్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు 2019లో అధ్యయనం చేశారు. అంతకంటే ముందే 2017 నవంబర్‌లో రామగుండం పోలీసు కమిషనరేట్‌లో అప్పటి కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ వారంతపు సెలవులకు శ్రీకారం చుట్టారు. కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసు విధులపై ఆవేదన వ్యక్తం చేస్తూ వారంతపు సెలవులు ఇవ్వాలని గళం విప్పారు. ప్రస్తుతం ఆయన సీఎంగా ఉండడంతో పోలీసు శాఖను ప్రక్షాళన చేసి వీక్లీ ఆఫ్‌లు, అదనపు అలవెన్స్‌లు అమలు చేస్తారనే ఆశాభావం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కొందరు పోలీసుల ఆవేదన
తగిన విశ్రాంతి లేక..
జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి పదేళ్లు అవుతోంది. వయస్సు 30 సంవత్సరాలు. ఇంత చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ వచ్చాయి. పని ఒత్తిడి, సమయానికి తినకపోవడం, మానసిక ఒత్తిడి వల్లనే బీపీ, షుగర్ వచ్చాయి.
పండుగ లేదు..
పోలీసు ఉద్యోగమంటే ఎంతో ఇష్టంతో చేరాను. పదేళ్లకు ఉద్యోగం మీద విరక్తి వస్తోంది. నా స్నేహితులు ఇతర ప్రభుత్వ శాఖల్లో వివిధ ఉద్యోగాల్లో ఉన్నారు. పండుగలకు కలుసుకుందామని అంటుంటారు. కానీ పోలీసులకు పండుగలకు సెలవు ఇవ్వరు. కుటుంబంతో సరదాగా ఒక్క రోజు గడుపుదామంటే అవకాశం దొరకది. తి నడానికి ఇంటికి వచ్చి తింటుండగా ఫోను వస్తే ఉరుకాలే. వారంలో ఒక్క రోజైన సెలవు ఇస్తే బాగుంటుంది.
వీక్లీ ఆఫ్ అమలులో ఇబ్బందులు
పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ అమలులో ఉన్నతాధికారులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరత వల్లే అమలులో అధికారులకు తలనొప్పిగా మారిందని జిల్లా స్థాయి అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. జిల్లాలో సుమారు 8లక్షలకు పైగా జనాభా కు 26 పోలీసుస్టేషన్లు, 10 సర్కిళ్లు, 950 మంది పోలీసు సిబ్బంది, ఒక డీసీపీ, ముగ్గురు ఏసీపీలు పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ వెయ్యి మందికి ఒక పోలీసు ఉండాలి. కానీ సిబ్బంది కొరత వల్ల వారంతపు సెలవులు, 8గంటల పని విధానం అమలు కావడం లేదని క్షేత్రస్థా యి సిబ్బంది అంటున్నారు. ఉన్నతాధికా రులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. సరిపడా సిబ్బంది ఉంటే తప్ప వారంతపు సెలవుల అమలు సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు.
జిల్లా కేంద్రంలో బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ సతీష్ ఈ ఏడాది మే 5న స్విమ్మింగ్ చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురై నీటిలోనే మునిగి మరణించాడు. కొద్ది రోజులుగా వరుస విధులు నిర్వర్తించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అనారోగ్యానికి ప్రధాన కారణాలు
విధి నిర్వహణలో నిలబడి ఉండాల్సిందే. శాంతిభద్రతల విధులు మొదలుకుని ఏ ప్రత్యేక విభాగాల్లో పని చేసినా అధికారుల ఒత్తిడి వల్ల రక్తపోటు, మధుమేహం రావడానికి కారణమవుతుంది.
ఎండ, వాన, చలి, దుమ్ముధూళి, కాలుష్యం ఇలా పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి రావడంతో జబ్బుల బారిన పడుతున్నారు.
సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తగినంత విశ్రాంతి లేక ఆరోగ్యం దెబ్బతింటోంది.
Comments
Please login to add a commentAdd a comment