ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅర్బన్: సమగ్రశిక్షాలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పేస్కేల్ ఇవ్వాలని శుక్రవారం డీఈవో యాదయ్య, కలెక్టర్ కార్యాలయ ఏవో రాజేశ్వర్‌కు వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. జిల్లాలో సమగ్రశిక్షాలో కేజీబీవీలో ప్రత్యేక అధికారులు, బోధన, బోధనేతరులు, ఎంఐఎస్సీసీవో, సీఆర్పీ, పా ర్ట్టైం ఇన్స్ట్రక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారని తెలి పారు. ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా రూ. 10లక్షలు, ఆరోగ్య బీమా రూ.10లక్షలు సౌకర్యం క ల్పించాలని, పదవీ విరమణ చేసే వారికి రూ. 25లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. 15 రోజులపాటు దశలవారీ ఆందోళన చేస్తామని, సా నుకూలంగా స్పందించకుంటే నిరవధిక సమ్మె కు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment