బోథ్: మండలంలోని సొనాల గ్రామంలో ప్రైవేట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు..మహారాష్ట్ర వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు శనివారం సొనాల బస్టాండ్ సమీపంలో గ్రామానికి చెందిన తుల గంగయ్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయన్ను స్థానికులు బోథ్ సీహెచ్‌సీ ఆస్పత్రికి అటు నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. బస్సును స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, దొడ్డిదారిన ప్రైవేట్ బస్సులు మహారాష్ట్ర నుంచి బెంగుళూరుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment