పెళ్లికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి | - | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి

Published Sun, Nov 24 2024 12:19 AM | Last Updated on Sun, Nov 24 2024 12:19 AM

పెళ్ల

పెళ్లికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి

● డ్రైవర్‌ అజాగ్రతతో కారు బోల్తా ● అమ్మమ్మ, మనుమరాలు మృతి ● బెల్లంపల్లిలో ఘటన

బెల్లంపల్లి: బంధువుల పెళ్లికి ఉదయం కారులో సంబురంగా వెళ్లిన ఆ కుటుంబం.. కార్యక్రమం అనంతరం ఇంటికి బయల్దేరింది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో కారు అదుపు తప్పి రోడ్డపై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. బెల్లంపల్లి రూరల్‌ సీఐ అఫ్జలుద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి కన్నాల బస్తీకి చెందిన టింకరి.కల్యాణి(60), ఆమె కూతురు పారుపల్లి అలేఖ్య, అల్లుడు రాజేశ్‌, మనుమడు సాయి విక్రాంత్‌, మనుమరాలు ప్రియ మేఘన((9)తో కలిసి భూపాలపల్లిలో బంధువుల పెళ్లికి కారులో శుక్రవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ తిరిగి బెల్లంపల్లికి బయల్దేరారు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకునేలోపు జాతీయ రహదారి ఒక్కసారిగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ప్రియ మేఘన అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన టింకరి కళ్యాణి మంచిర్యాలలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనలో అలేఖ్య ఆమె భర్త రాజేశ్‌ గాయపడ్డారు. కారు డ్రైవర్‌ కిరణ్‌కుమార్‌తోపాటు, అలేఖ్య కొడుకు సాయి విక్రాంత్‌ సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.

నిద్రమత్తే కారణం..

కారు డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ కారును అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడంతోపాటు నిద్ర కమ్ముకురావడంతో కారు అదుపు తప్పి బోల్తాపడినట్లు పో లీసులు భావిస్తున్నారు. మరో పది నిమిషాలు సురక్షితంగా కారు నడిపి ఉంటే.. అందరూ క్షేమంగా ఇంటికి చేరుకునేవారని పేర్కొన్నారు. ఘటనాస్థలి ని శనివారం ఉదయం బెల్లంపల్లి రూరల్‌ సీఐ అఫ్జలుద్దీన్‌, టూటౌన్‌ ఎస్సై మహేందర్‌ పరిశీలించారు. అలేఖ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పెళ్లికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి1
1/2

పెళ్లికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి

పెళ్లికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి2
2/2

పెళ్లికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement