ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి హైవే వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డి పట్టుకున్నారు. వీటిని ఆర్కేపీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంచిర్యాల ఇసుక రీచ్ నుంచి మందమర్రి మండలానికి ఇసుక రవాణాకు ఇంకా ఆన్లైన్ ఓపెన్ కాలేదని అప్పటివరకు అక్రమంగా తరలిస్తే వాహనాలు సీజ్ చేస్తామని మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. అనుమతులు ఒక చోట తీసుకుని మరో చోటికి సరఫరా చేయొద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment