ఇద్దరు పోలీసులకు ప్రశంసాపత్రం
నస్పూర్/లింగాపూర్: గంజాయి కేసులో నేరస్తులకు శిక్షపడేలా చేసిన ఇద్దరు పో లీసులకు రాష్ట్ర డీజీపీ జితేందర్ అభినందించారు. శని వారం హైదరాబాద్‌లోని ఆయన చాంబర్‌లో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రస్తుత మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ప్రస్తుత లింగాపూర్ ఎస్సై గంగన్న గతంలో ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్నప్పుడు గంజాయి సాగు కేసులో నేరస్తులను కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయడంతో మేజిస్ట్రేట్.. ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించారు. ప్రశంసాపత్రం అందుకున్నవారిని సీపీ శ్రీనివాసులు, డీసీపీ భాస్కర్‌రెడ్డి, ఏసీపీ ప్రకాశ్, లింగాపూర్ పోలీసులు అభినందించారు.
అడవి కుక్కలదాడిలో జింక మృతి
బోథ్: మండలంలోని ఘన్‌పూర్ అటవీ ప్రాంతంలో అడవి కుక్కలదాడిలో జింక మృతిచెందింది. శనివారం అటవీ ప్రాంతానికి వెళ్లిన గ్రామస్తులు చూసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే పులి దాడిలో జింక మృతిచెందిందని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పులి కా దని అడవి కుక్కలే జింకపై దాడి చేశాయని అధికారులు తేల్చారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment