నాలుగు రోజులుగా నరకయాతన
● గూడెం వంతెన కింద వృద్ధుడిని వదిలివెళ్లిన ఘటన
దండేపల్లి: అచేతన స్థితిలో ఉన్న వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం దండేపల్లి మండలం గూడెం గోదావరి నది వంతెనకింద వది లివెళ్లారు. ఎముకలు కొరికే చలిలో గజగజ వణుకుతూ మూలుగుతు పడి ఉన్న వృద్ధుడిని నది స్నా నానికి వచ్చిన కొందరు గమనించారు. అతడితో మాట్లాడి వివరాలు తెలుసుకోగా నా పేరు మార్నేని పోచయ్య, గ్రామం ఇందారం, తనకు ఒక కుమారుడు ఉన్నాడని చెప్పాడు. అతన్ని ఇక్కడ ఎవరు వదిలి వెళ్లింది మాత్రం తెలియదన్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులు పలు వాట్సాప్ గ్రూప్‌ల్లో వైరల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న దండేపల్లి ఎస్సై ఉదయ్‌కిరణ్ శనివారం సిబ్బందితో అక్కడకు చేరుకుని వృద్ధుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతన్ని మందమర్రిలోని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment