● అడ్డుకున్న పోలీసులు
దండేపల్లి: ఓ యువకుడిని హత్యచేసిన వ్యక్తి జైలు నుంచి విడుదలై కొన్నిరోజుల తర్వాత మళ్లీ గ్రామానికి రావడంతో వివాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. దండేపల్లి మండలం గూడెం ఒడ్డెర కాలనీకి చెందిన రాజమౌళి గ్రామానికి చెందిన యువకుడు అనిల్ని ఏడాది క్రితం మద్యంలో పురుగులమందు కలిపి తాగించి హత్య చేశాడు. దీంతో రాజమౌళిని పోలీసులు అ రెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవల జైలు నుంచి విడుదలై కొద్దిరోజులు వేరే చోటు ఉంటున్నాడు. శనివారం ఒడ్డెర కాలనీలోని తన ఇంటికి వచ్చి ప రిసరాలను శుభ్రం చేస్తుండగా అనిల్ తండ్రి శంకర్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకోగా, రాజమౌళితో తమకు ప్రాణహా ని ఉందని చెప్పాడు. పోలీసులు విచారణ చేస్తుండగా శంకర్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు. నిందితుడు కాలనీలో ఉండకూడదని, మృతుడి తండ్రితోపాటు కాలనీవాసులు డిమాండ్ చేశారు. దీంతో న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment