అతివలకు ఉపాధి హామీ
సకాలంలో పూర్తి చేస్తాం
జిల్లాలో గ్రామసభల్లో గుర్తించిన పనులు సకాలంలో పూర్తిచేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తిచేస్తాం. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– కిషన్, డీఆర్‌డీవో, మంచిర్యాల
కోటపల్లి: 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి..ఈ సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా గుర్తించిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ పనులను వేగవంతం చేసింది. గత అక్టోబర్ 2 నుంచి గ్రామసభల్లో అమోదించిన పనులు వచ్చేఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయడానికి మండలం యూనిట్‌గా ఈ పనులు సకాంలో పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సూచించిన 6 రకాల పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వె య్యికిపైగా పనులు గుర్తించారు. సింహభాగం మ హిళలకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు.
మహిళాశక్తికి భరోసా: మహిళా సంఘా సభ్యులందరికీ ఉపాధి భరోసా కల్పించేలా ఉపాధి పథకంలో భాగస్వాములను చేయనున్నారు. వారిని స్వయం ఉపాధివైపు మళ్లించేలా రుణాలిచ్చి అవులు, మేకల, పెంపకం చేపట్టేలా చేస్తారు. పశువుల షెడ్లు, వర్మీ కంపోస్టు, అజోం మొక్కల పెంపకం బీడు భూములను అభివృద్ధి చేస్తారు.
పొలం బాటలు: గ్రామాల్లో పంట ఉత్పత్తులను ఇంటికి చేర్చడానికి ఈసారి మట్టిదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాల్లో 60 కి.మీ రోడ్డు పనులు చేపట్టనున్నారు.
ఫలాల వనాలు: ఉద్యానశాఖ అధ్వర్యంలో పండ్లతో పంటల ద్వారా రైతులను ప్రొత్సహించడం, వాటికి రాయితీపై బిందు, తుంపర్ల పరికరాలు ఇచ్చేలా చేస్తారు. ఈత తాటి వనాలు పెంచుతున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన నర్సరీల్లో ఈ పనులు చేపట్టనున్నారు.
జలనిధి: జల సంరక్షణలో ప్రజలను భాగసామ్యం చేయడం, ఇంటింటా ఇంకుడుగుంతలు, ఫారం పాండ్లు, ఇంటి కప్పు భాగంలో కురిసిన నీటిని భూగర్భంలోకి ఇంకించడం, చేతిపంపుల వద్ద ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వడం, చెక్‌డ్యాం కట్టేలా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో మొత్తం 27 పనులు చేపట్టనున్నారు.
గ్రామీణ పారిశుధ్యం: గ్రామాల్లో వ్యక్తిగత ఇంకుడుగుంతల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఒక్కో మండలంలో కనీసం 10 చొప్పున ఇంకుడుగుంతలను చేపట్టాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు.
మౌలిక సదుపాయాలు: గ్రామాల్లోని ప్రభుత్వ వి ద్యాసంస్థల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు, సిమెంట్ రహదారులు నిర్మాణం, అంగన్‌వాడీ భవనాలు నిర్మించనున్నారు. వీటిని మండలానికి ఐదు చొప్పున చేపట్టనున్నారు.
ఆరు రకాల పనులకు ప్రాధాన్యం
సింహభాగం మహిళలదే..
ఉమ్మడి జిల్లాలో ..
జిల్లా మండలాలు పంచాయతీలు జాబ్‌కార్డులు కూలీలు
ఆదిలాబాద్ 17 468 1,75,747 3,70,082
కుమురంభీం 15 335 1,29,885 2,77,287
నిర్మల్ 18 396 1,80,572 3,70,550
మంచిర్యాల 16 311 1,21,067 2,55,151
Comments
Please login to add a commentAdd a comment