తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన ఇట్టెం గణేశ్ కొద్ది రోజుల కిందట దుబాయ్ వెళ్లాడు. అతని భార్య స్వప్న ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. రాత్రి సమయంలో పక్కనే ఉన్న తమ బంధువుల ఇంటికి నిద్రించేందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి బంధువుల ఇంటికి నిద్రించేందుకు వెళ్లిన స్వప్న శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగానే తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం తెరిచి అందులోని రూ.20 వేలు చోరీ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై సుమలత సంఘటన స్థలానికి చేరుకుని జాగిలంతో ఇంటిని పరిశీలించారు. స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్టీసీ బస్టాండ్‌లో..
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం రాత్రి దొంగతనం జరిగినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కాసిపేట మండలం సోమగూడెంకు చెందిన కోదాటి పద్మ బంధువుల పెళ్లికి కరీంనగర్ వెళ్లేందుకు ఆటోలో బస్టాండ్‌కు వచ్చింది. కొంత సమయం తర్వాత బస్సు రాగానే ఎక్కి బ్యాగును పరిశీలించగా జిప్ ఓపెన్ చేసి ఉంది. గమనించిన ఆమె అనుమానంతో బ్యాగును తనిఖీ చేయగా అందులోని రూ.1లక్ష 40వేల విలువ గల 7 తులాల బంగారం, రూ.1500 విలువ గల వెండి పట్టీలు కన్పించకపోవడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
చోరీకి పాల్పడ్డ నిందితుడి అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని జైజవాన్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఈనెల 8న రాత్రి సమయంలో చోరీ జరిగింది. రూ.15వేల నగదుతో పాటు సెల్‌ఫోన్ దొంగతనానికి పాల్పడిన క్రాంతినగర్‌కు చెందిన షేక్ అయాన్‌ను టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ఐడీ పార్టీ పోలీసులు నరేశ్, క్రాంతి, సుధాకర్ రెడ్డి, నరేందర్, శ్రీకాంత్, గోపాల్ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అనుమానంగా వ్యక్తి తిరగడంతో విచారించారు. దీంతో నిందితుడు షేక్ అయాన్ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతనిపై ఇప్పటికే ఎనిమిది పాత కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి రూ.5వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.
కాపర్‌వైర్ దొంగల పట్టివేత
రెబ్బెన/ తాండూర్: సింగరేణి సంస్థకు చెందిన కాపర్ కేబుల్ నుంచి కాపర్ వైరు చోరీకి పాల్పడి తరలిస్తున్న దొంగలను శుక్రవారం సింగరేణి ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది తాండూర్‌లో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్ ఆధ్వర్యంలో ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది తాండూర్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు కాపర్ వైరును ఆక్రమంగా తరలిస్తుండగా గమనించిన సిబ్బంది పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తాండూర్‌లోని ఓ స్క్రాప్ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా సింగరేణికి చెందిన మూడు కిటికీలు, డోజర్‌కు సంబంధించిన విభాగాలు లభ్యం కాగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్రమంగా సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారికి నోటీసులు అందజేశారు. తనిఖీల్లో ఎస్‌అండ్‌పీసీ జూనియర్ ఇన్స్‌పెక్టర్ రాజమౌళి, జమేదార్ శంకర్, తపన్ మండల్, గొర్ల శ్రీనివాస్, శ్రీనివాస్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి
నెన్నెల: మండలంలోని నందులపల్లికి చెందిన పాకాల భీమేశ్(58) శుక్రవారం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం భీమేశ్ కొంత కాలంగా మతిస్థిమితం లేకపోవడంతో రోజంతా ఊళ్లో తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడు. ఈనెల 11న తెల్లవారుజామున వెళ్లిన భీమేశ్ రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో కుమారుడు శ్రావణ్ తండ్రి భీమేశ్ కోసం చాలా చోట్ల వెతికినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం నందులపల్లి శివారులోని చెరువులో భీమేశ్ మృతదేహాన్ని చూసిన అదే గ్రామానికి చెందిన సాయికుమార్ శ్రావణ్‌కు విషయం తెలిపాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడని కుమారుడు శ్రావణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బైక్‌లు ఢీ.. బాలిక మృతి
ఆసిఫాబాద్‌రూరల్: ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని సాలేగూడ వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జన్కాపూర్‌కు చెందిన మహేశ్ తన అక్క కూతురు విపాసన (8)తో కలిసి ఇప్పల్ నవేగాంలోని తన చేనుకు వెళ్లి వస్తుండగా సాలెగూడకు చెందిన విజయ్ ఆసిఫాబాద్ నుంచి సాలేగూడకు వెళ్తున్న క్రమంలో ఎదురెదురుగా వారి బైక్‌లు ఢీ కొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలించే క్రమంలో విసాసన మృతిచెందగా మిగితా ఇద్దరు మంచిర్యాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మహేశ్‌కు తలకు, విజయ్‌కు భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. విపాసనకు కడుపులో ఎముకల విరిగి శ్వాసకు ఇబ్బందైనట్లు వైద్యులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
● క్షతగాత్రులను చూసి కాన్వాయ్ ఆపిన మంత్రి సీతక్క
దిలావర్‌పూర్: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ వైపు నుంచి చాక్‌పల్లి గ్రామానికి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా న్యూలోలం గ్రామ సమీపంలో పంట చేలనుంచి జాతీయరహదారి వైపునకు బాలుడిని తీసుకుని వస్తున్న ఇద్దరు రైతులు బైక్‌తో బలంగా ఢీకొన్నారు. దీంతో చాక్‌పల్లి గ్రామానికి వెళ్తున్న విఠల్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగితా వారికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో జిల్లా పర్యటనలో భాగంగా బాసర నుంచి నిర్మల్ వైపునకు వస్తున్న మంత్రి సీతక్క క్షతగాత్రులను చూసి కాన్వాయ్ దిగి వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేవరకు అక్కడే ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment