తిర్పెల్లిలో వరిధాన్యం దొంగతనం
లక్ష్మణచాంద: మండలంలోని తిర్పెల్లిలో వరి ధాన్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మండలంలోని తిర్పెల్లి గ్రామానికి చెందిన భైర గంగాధర్ అనే రైతు గ్రామ సమీపంలోని రోడ్డుపై తినడానికి అవసరమైన వరిధాన్యం ఆరబెట్టారు. గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆర బెట్టిన వరి ధాన్యం నుంచి 70 కేజీల నాలుగు బస్తాలు ఎత్తుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసినట్లు రైతు గంగాధర్ తెలిపారు.
రేషన్‌బియ్యం పట్టివేత
బెల్లంపల్లి: రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా ఓమినీ వ్యాన్‌లో తరలిస్తుండగా శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై కె.మహేందర్ తెలిపిన వి వరాల ప్రకారం పట్టణంలోని సుభాష్‌నగర్‌బస్తీకి చెందిన ఎండీ జమీల్ అనే వ్యక్తి ప్రజల వద్ద నుంచి 4.9 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని త క్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి ఓమినీ వ్యాన్‌లో తీసుకెళ్తున్నాడు. సుభాష్‌నగర్‌బస్తీలో వాహనాల తని ఖీ చేస్తుండగా ఓమినీ వ్యాన్‌లో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు జమీల్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బ్యాంక్ చోరీకి విఫలయత్నం
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని రామాయి తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. బ్యాంక్ గోడకు కన్నం (రంధ్రం) వేసి బ్యాంక్‌లోనికి దొంగలు ప్రయత్నించారు. వెంటనే బ్యాంక్ సైరన్ మోగడంతో దొంగలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వెనుకాల ఉన్న చేనులో నుంచి దొంగలు వచ్చినట్లు గుర్తించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment