ఆదిలాబాద్‌టౌన్: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేసిన కేసులో భర్తకు జీవితఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధి స్తూ జిల్లా జడ్జి ప్రభాకరావు తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి గంగాసింగ్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2022 జూలై 31న రాత్రి 9 గంటల ప్రాంతంలో యాపల్‌గూడకు చెందిన అలిచెట్టి విష్ణు భార్య కవితను తీసుకొని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో ఆదిలాబాద్‌కు వచ్చాడు. ఆగస్టు 1న ఉదయం 8 గంటల ప్రాంతంలో బస్సులో గిమ్మ క్రాస్‌రోడ్డు వద్ద దిగి రాంపూర్ శివారులో భార్యను బండరాయితో తలపై కొట్టాడు. అనంతరం నైట్ ప్యాంట్ నాడాను ఆమె మెడకు బిగించి చెట్టుకు కట్టేశాడు. ఆమె ఊపిరాడక మృతిచెందింది. ఆ తర్వాత పోలీసుస్టేషన్‌కు వెళ్లి సరెండర్ అయ్యాడు. అప్పటి జైనథ్ ఎస్సై పెర్సిన్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పీపీ మధుకర్ సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. ఈ మేరకు జడ్జి తీర్పు వెల్లడించినట్లు వివరించారు.
నేరడిగొండలో..
భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్తకు జీవితఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకర రావు తీర్పునిచ్చినట్లు లైజన్ అధి కారి గంగాసింగ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. నేరడిగొండ మండలం దేవుల్‌నాయక్ తండాకు చెందిన బిడ్వార్ రాజుకు భూతాయి గ్రా మానికి చెందిన జమునతో 2014లో పెద్దలు కు దిర్చిన వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యపై తరచూ అనుమానంతో వేధింపులకు పాల్పడేవాడు. 2021 జూన్ 30న ఉదయం 4 గంటల సమయంలో గడ్డపారతో కొట్టగా ఆమె తీవ్ర గాయాలపాలై మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయగా అప్పటి నేరడిగొండ ఎస్సై భరత్‌సుమన్ కేసు నమోదు చేశారు. పీపీ మధుకర్ 16 మంది సాక్ష్యలను విచారించి నేరం రుజువు చేయగా, జడ్జి తీర్పు వెల్లడించినట్లు లైజన్ అధికారి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment