‘గిరిజన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి’
ఉట్నూర్‌రూరల్: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న భాషా పండితులను అప్‌గ్రేడ్ చేయాలని టీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాథోడ్ గణేశ్ మాట్లాడుతూ.. సీఆర్టీలను రెగ్యూలర్ చేయాలని, సీఆర్టీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ డీవో పోస్తులను భర్తీ చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ డీఎస్సీని, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. టీటీఎఫ్ సంఘానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాథోడ్ గణేశ్, జిల్లా అధ్యక్షుడు రవీందర్, జిల్లా, మండల బాధ్యులు రామారావు, పవన్‌లాల్, రాథోడ్ దేవిదాస్, ఈశ్వర్, విఠల్, షేర్‌సింగ్, రవీందర్, వికాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment