పిచ్చికుక్క స్వైరవిహారం
వేమనపల్లి: మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలోని రోడ్డుపై ఉన్న కొండ రమ్య అనే 9 నెలల గర్భిణీని తీవ్రంగా గాయపర్చింది. అదే విధంగా సుమలత, ఎల్లెల పోశక్కల కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని మరో ఐదుగురిపై దాడికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బాధితులను స్థానిక పీహెచ్‌సీలో ఆర్‌ఎస్‌వీ టీకా తీసుకుని మెరుగైన వైద్యం కోసం చెన్నూర్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలోని రెండు కుక్కలు మూడు రోజులుగా మనుషులు, పశువులపై దాడులకు తెగబడుతున్నాయి. గ్రామపంచాయతీ సిబ్బంది మేల్కొని గామంలో పిచ్చికుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment