కొనసాగుతున్న సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె
మంచిర్యాలఅర్బన్: తమ సమస్యల పరిష్కారానికి సమగ్రశిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొ నసాగుతోంది. ఇందులో భాగంగా కలెక్టరేట్ ఎ దుట చేపట్టిన దీక్షలు శుక్రవారం కొనసాగా యి. నాలుగోరోజు విధులు బహిష్కరించి దీక్షలు చేపట్టారు. దీక్షల శిబిరాన్ని ఆర్‌యూపీపీటీఎస్(పండిత పరిషత్ ఉపాధ్యాయ సంఘం) అ ధ్యక్షుడు సత్యనారాయణచారి, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయకృష్ణ, కుమార్, అల్ఫోర్స్ వి ద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్‌రెడ్డి, భారతీయ జ నతాపార్టీ అధ్యక్షుడు రఘునాథ్‌రావు, పీఆర్‌టీ యూ టీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఇన్నారెడ్డి, టీఎస్‌యుటీఎఫ్ ఉపాధ్యక్షుడు గోళరామన్న, మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురా లు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్న, ఆర్గనై జింగ్ సెక్రటరీ సుమన పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment