ఉద్యోగంలోకి చేర్చుకోవడంలో నిర్లక్ష్యం
● డివిజన్ కార్యాలయం ఫర్నిచర్ జప్తు
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ పరిధిలో పనిచేసిన ఎనిమల్ ట్రాకర్‌ను విధుల్లోకి తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన అటవీశాఖ అధికా రులకు షాక్ తగిలింది. కోర్టు ఆదేశాలు జారీ చేసినా నాలుగు నెలలుగా విధుల్లో చేర్చుకోలేదు. దీంతో లేబర్ కోర్టు ఆదేశాల ప్రకారం డివిజన్ కార్యాలయంలోని పర్నిచర్ జప్తు చేశారు. కోర్టు సిబ్బంది లక్సెట్టిపేట జూనియర్ సివిల్ కోర్టు ఫీల్డ్ ఆఫీసర్ ఎండీ.యూసఫ్ అలీ, కోర్టు ప్రాసెస్ సర్వేయర్స్ సాయికుమార్, సంధ్యారాణి తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం అటవీ డివిజన్ తాళ్లపేట్ అటవీ రేంజ్‌లో కడెం మండలం దోస్తునగర్‌కు చెందిన బియ్యాల లింగయ్య ఎనిమల్ ట్రాకర్‌గా పని చేస్తున్నాడు. 2017లో అతనిని అటవీ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. లింగయ్య 2021లో గోదావరిఖని లేబర్ కోర్టును ఆ శ్రయించాడు. లింగయ్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని 2024, జూన్ 18న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు నెలలు గడిచినా లింగయ్యను అటవీ అధికారులు విధుల్లోకి తీసుకోలేదు. దీంతో నవంబర్‌లో ఆయన తిరిగి కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆదేశాలను బేఖాతర్ చేసినందుకు నాలుగు నెలల వేతనం రూ.లక్ష అటవీశా ఖ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అటవీశాఖ అధికారులు డబ్బులు చెల్లించకపోవడంతో వా రం క్రితం అటవీ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం డివిజన్ కార్యాలయంలోని ఫర్నిచర్, బీరువాలు, కంప్యూటర్స్‌తోపా టు ఒక జీపు, తాళ్లపేట్ రేంజ్ కార్యాలయంలోని పర్నిచర్‌ను లక్సెట్టిపేట్ జూనియర్ సివిల్ కోర్టు శుక్రవారం సిబ్బంది జప్తుచేశారు. లక్సెట్టిపేట్‌కు తరిలించారు. సామగ్రిని లక్సెట్టిపేట కోర్టుకు అప్పగిస్తామని తెలిపారు. ఈ విషయంపై జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్‌సింగ్‌ను ఫోన్‌లో సంప్రదించగా, కోర్టు ఆదేశాల ప్రకారం పర్నిచర్ తీసుకెళ్లారని, ఈ విషయంపై హైకోర్టులో అప్పీల్ చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment