ప్రభుత్వ భూమిలో పాగా
● నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నం ● సుమారు రూ.కోటి విలువైన స్థలంపై కన్ను
నస్పూర్: ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చెర నుంచి విడిపించి భూములు లేని పేదలకు పంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, నస్పూర్‌లో పలువురు భూ కబ్జాదారులు సర్కార్ భూమిలో పాగా వేస్తున్నారు. నస్పూర్ గేట్ చౌరస్తా నుంచి మున్సిపాలిటీకి వెళ్లే దారిలో బీఆర్‌ఎస్ భవనం సమీపంలోని సర్వే నంబర్ 42లో సుమారు ఆరు గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 43లోని ప్రైవేటు భూమిగా చూపుతూ నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ పత్రాలు చూపి భూమి చుట్టూ ప్రహరీ నిర్మించారు. సుమారు రూ.కోటి విలువ చేసే సర్కారు స్థలం కబ్జాకు అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు మారగానే..
హద్దులు మారుస్తూ...
పట్టణ పరిధిలోని పలు శాఖలకు చెందిన అధికారులు మారినప్పుడల్లా ప్రభుత్వ భూముల హద్దులు మారుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 43లో గ్రామపంచాయితీ లే అవుట్ వెంచర్ కోసం 2017లో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేసి హద్దులు ఏర్పా టు చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన భూమి హ ద్దులను కాదని స్థానిక అధికారులు మళ్లీ సర్వే చేసి వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వ భూముల హ ద్దుల నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు మళ్లీ సర్వే చేసి హద్దులను ఏ ర్పాటు చేసి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కా కుండా చూడాలని పట్టణవాసులు కోరుకుంటున్నా రు. ఇదే విషయమై స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్‌ను సంప్రదించగా సదరు భూమి సర్వే నంబర్ 43 ప్రైవేటు భూమిగా తమ సిబ్బంది సర్వేలో తేలిందన్నారు. అయినా ప్రహరీ నిర్మించిన వారిని పిలిపించి డాక్యుమెంట్లు పరిశీలిస్తామని తెలిపారు. అభ్యంతరాలుంటే మళ్లీ సర్వే చేపిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment