గ్రూప్– 2 పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి
నస్పూర్: జిల్లాలో ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ సూచించారు. నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ మోతీలాల్, అదనపు డీసీ పీ రాజుతో కలిసి ముఖ్య పర్యవేక్షకులు, పరిశీలకులు, రూట్ అధికారులతో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 48 కేంద్రాలు ఏ ర్పాటు చేశామన్నారు. 14, 951 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో వైద్య, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వాలన్నారు.
సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
నస్పూర్: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం నీడ కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిందని వివరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలను ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సమాఖ్య భవనం ఏర్పాటు చేయాలి
మంచిర్యాలటౌన్: పట్టణంలోని మహిళా సమాఖ్య భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు భవన ఏర్పాటు పనులను చేపట్టాలని కలెక్టర్‌కుమార్ దీపక్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాలలో మహిళా సమాఖ్య భవన ఏర్పాటు కోసం అధి కారులతో కలిసి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment