ఇసుక తరలింపునకు ప్రత్యేక చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్: జిల్లాలోని గృహ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఇసుక తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్‌దీపక్ తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో అదనపు కలెక్టర్ మోతీ లాల్‌తో కలిసి రెవెన్యూ, పంచాయతీ, రోడ్లు భవనాలు, భూగర్భ జలశాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్ధం జిల్లాలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల నుంచి మరింత ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకో వాలన్నారు. హాజీపూర్, వేంపల్లి, జైపూర్, మండలం వేలాల ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాల భవ న నిర్మాణానికి ఇసుక తరలింపులో అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన పురుషోత్తం నాయక్..
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిగా పురుషోత్తం నాయక్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్క అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment