పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో
లక్సెట్టిపేట: మండలంలోని ఎల్లారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈవో యాదయ్య శు క్రవారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదిలో బోర్డుపై రా సిన పదాలను చదివించారు. విద్యార్థులకు మంచి విద్యాబోధనను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని వంటగదులను పరిశీలించారు. రుచికరమైన భోజనం వడ్డించాలని తెలిపారు. అనంత రం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఆయన వెంట పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పరిశీలించి..రుచి చూసి..
దండేపల్లి: మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని డీఈవో యాదయ్య శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనం పరిశీలించి రుచి చూశారు. నాణ్యమైన బియ్యం, కూరగాయలతో వంట చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. అ నంతరం పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. ప్రణాళికతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment