
మండలానికో మినీ స్టేడియం నిర్మాణం
● చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ● భీమారంలో స్థల పరిశీలన
భీమారం: చెన్నూర్ నియోజకవర్గంలో ప్రతీ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మించనున్నట్లు ఎ మ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి తెలిపారు. భీమా రం మండల కేంద్రంలోని 138సర్వేనంబరులో మి నీ స్టేడియం కోసం కేటాయించిన ఐదెకరాల స్థలా న్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా.. క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా చర్యలు చే పట్టినట్లు తెలిపారు. త్వరలోనే స్టేడియం నిర్మాణా నికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పొడేటి రవి, మండల నాయకులు కొత్త సత్తిరెడ్డి, బుక్యా లక్ష్మణ్, ఉస్కమల్ల పున్నం చందు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి
రామకృష్ణాపూర్: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం అందించిన మహాత్మాగాంధీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. పట్టణంలో గురువారం నిర్వహించిన మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకల్లో ఆయనతోపాటు టీపీసీసీ కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్‌అజీజ్, గోపతి రాజయ్య, మహంకాళి శ్రీనివాస్, వొడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి
జైపూర్: యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడాస్ఫూర్తిని చాటుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. జైపూర్‌లో గత 15రోజులుగా నిర్వహిస్తున్న వీవీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు గురువారం ఫైనల్స్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌ను ఆయన వీక్షించారు. విజేతగా నిలిచిన ఇందారం జట్టుకు రూ.30 వేల నగదుతోపాటు ట్రోఫీ, రన్నరప్ కాన్కూర్ జట్టుకు ట్రోఫీ అందజేశారు. అండర్–17 జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికై న ఈసం సంజనను సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, ఫయాజ్, మూల రాజిరెడ్డి పాల్గొన్నారు.
గోదావరి రోడ్డు పరిశీలన
జైపూర్: మండలంలోని రామారావుపేట గ్రామం నుంచి గోదావరి నది పంట పొలాలకు వెళ్లే రోడ్డును సింగరేణి అధికారులు తొలగించగా, ఆ రోడ్డును ఎమ్మెల్యే వివేక్ గురువారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment