ఏపీ హైకోర్టులో సినీనటుడు అల్లు అర్జున్ పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ ఎన్నికల సమయంలో తనపై కేసు నమోదైంది. ఈ విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. తనపై వేసిన పిటీషన్‌ను క్వాష్ చేయాలని కోర్టును కోరారు. కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు స్వీకరించింది. అయితే, అక్టోబర్ 22న ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల బరిలో నిల్చోడంతో ఆయనకు మద్ధతుగా బన్నీ వెళ్లారు. అయితే, అల్లు అర్జున్ అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. అనుమతి లేకుండా భారీ జనసమీకరణ చేశారంటూ ఆ సమయంలో అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment