సంధ్య థియేటర్ కేసులో బెయిల్ ద్వారా బయటకు వచ్చిన సినీ నటుడు అల్లు అర్జున్ మరోసారి మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదల సమయంలో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఆ ఘటన అనుకోకుండా జరిగిందని తెలిపారు. ఈ సంఘటనతో నష్టపోయిన బాధిత కుటుంబం తనను క్షమించాలని అల్లు అర్జున్ కోరారు. ఇలాంటి సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
'సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన ఆ రోజు మా కంట్రోల్‌లో లేదు. 20 ఏళ్లుగా నా సినిమా విడుదల సమయంలో ఆ థియేటర్‌కు 30 సార్లు వెళ్లాను. కానీ, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఏదేమైనా ఒకరు చనిపోవడం చాలా బాధ అనిపించింది. నేను ఆ కుటుంబాన్ని త్వరలో కలుస్తాను. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాను. నన్ను ఆ కుటుంబం క్షమించాలని కోరుకుంటున్నాను. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగింది.
ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా చాలామంది నాకు మద్దతు ఇచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. నాపై మీరు చూపించిన ప్రేమతో నా హృదయం నిండింది. నామీద అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానాలకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment