
చెన్నై : వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ భర్త పీటర్ పాల్ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. ఛాతి నొప్పి కారణంగా ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్లు వనితా విజయ్‌కుమార్ తెలిపారు. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన వనితా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 'చెప్పాల్సింది చాలా ఉంది కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేను. దేవుడు చాలా గొప్పవాడు. జీవితం చాలా కష్టమైంది. మన లైఫ్‌లో జరిగే ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతుందని నేను నమ్ముతాను. పరిస్థితులు అన్ని సర్దుకుంటాయి' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సంచలన నటిగా ముద్ర వేసుకున్న నటి వనితా విజయ్‌కుమార్ ఈ మధ్య పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇతరుల విషయాల్లో తలదూర్చకండి)
అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే వనితా తన భర్తను వివాహం ఎలా చేసుకుంటుందంటూ పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ ఆరోపణలు చేసింది. డబ్బు కోసమే ఇవన్నీ చేస్తుందంటూ ఆమె వనితపై కేసు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో వనితా విజయ్‌కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె మూడో పెళ్లిపై పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలతో దూషించుకున్న వనితా, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ ఇప్పుడు ఏకంగా నష్టపరిహారం సమన్లు, బెదిరింపుల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక 1995లో విడుదలైన చంద్రలేఖ చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వనితా విజయ్‌కుమార్ పలు చిత్రాల్లో నటించింది. అయితే నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. (విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లా?)
Lots to say...nothing I can..god is great..believe..everything happens for a reason...life is tough ..face it..when u do..trust me ..everything will be ok...get tough..hit back...show the world you can..
— Vanitha Vijaykumar (@vanithavijayku1) August 25, 2020