Disha Patani to Pair Up With Jr NTR 30th Movie, Details Inside - Sakshi

NTR 30 : కొరటాల-ఎన్టీఆర్‌ ప్రాజెక్ట్‌.. హీరోయిన్‌గా ఆ బ్యూటీ!

May 22 2022 11:23 AM | Updated on May 22 2022 12:52 PM

Disha Patani To Pair Up With Jr Ntr In Koratala Siva Movie - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ రిపీట్‌ కానుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యుశసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌30 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్నదానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతుంది.

గతంలో ఈ సినిమాలో ఆలియా భట్‌ నటించనుందనే రూమర్స్‌ వినిపించినా పెళ్లి తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌ ఎవరన్నదానిపై రకరకాల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ ఫైనలైజ్‌ అయ్యిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement