
– మిమో చక్రవర్తి
‘‘తెలుగులో ‘నేనెక్కడున్నా’ సినిమా చేస్తున్నానని మా నాన్నకి (బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి) చెప్పినప్పుడు సంతోషపడ్డారు. ‘భాష రాదని ఆలోచించవద్దు... వంద శాతం నీ బెస్ట్ ఇవ్వు’ అన్నారు. నటీనటులకు భాష అనేది అడ్డు కాదు... కాకూడదని నా అభిప్రాయం’’ అని మిమో చక్రవర్తి తెలిపారు. మిమో చక్రవర్తి, సాషా చెత్రి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘నేనెక్కడున్నా’. మాధవ్ కోదాడ దర్శకుడు.
కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మిమో చక్రవర్తి మాట్లాడుతూ–‘‘ఊటీలో మా నాన్నగారికి హోటల్ ఉంది. నేను అక్కడే ఉండటం వల్ల తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక మాధవ్ కోదాడగారు ముంబై వచ్చి కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నాను.
ఇదొక కంప్లీట్ పాప్‌కార్న్ ఎంటర్‌టైనర్. పాటలు, మంచి యాక్షన్ సీక్వెన్సులు, సన్నివేశాలు ఉన్నాయి. తెలుగులో నాకు మంచి లాంచింగ్ మూవీ అవుతుందనుకుంటున్నాను. విలన్ పాత్రలకు నేను పర్ఫెక్ట్ ఫిట్ అని నా ఫీలింగ్. మంచి క్యారెక్టర్లు వస్తే కమెడియన్‌గా, సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధం. నాన్నగారు ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘ఫౌజీ’లో నటిస్తున్నారు. నేను విక్రమ్ భట్ దర్శకత్వంలో ‘హాంటెడ్’కి సీక్వెల్ చేస్తున్నాను. అలాగే నెట్‌ఫ్లిక్స్ కోసం ‘ఖాకీ’ అనే వెబ్ సిరీస్ సీజన్ 2 చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment