
బెల్లి జనార్ధన్, జయసుధ, బాబ్జీ
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిద్దేష్, ‘శుభలేఖ’ సుధాకర్, ‘శంకరాభరణం’ తులసి, షాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్‌వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో లాంచ్ వేడుకకు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్. నారాయణమూర్తి, జయసుధ తదితర ప్రముఖులు హాజరై... సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావా లని, ఈ చిత్రం విజయం సాధించాలని పేర్కొన్నారు.
‘‘ఒక గొప్ప సామాజిక లక్ష్యంతో మా ప్రజా నాట్యమండలి బాబ్జీ తీసిన ఈ సినిమాను విజయవంతం చేయాలని, ఇటువంటి చిత్రాలు మరిన్ని రావడానికి రెండు రాష్ట్రాల్లోని మా పార్టీల, ప్రజా సంఘాల సభ్యులు, అభిమానులు కృషి చేయాలని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాం’’ అన్నారు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ. ఈ వేడుకలో వివిధ వామపక్ష పార్టీల నేతలు, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎమ్‌ఎల్‌సీ సత్యం తదితర ప్రముఖులు పాల్గొన్నారు.