సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంటికి వెళ్లిన వారు బన్నీ మేనేజర్ మూర్తికి నోటీసులు అందించారు. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజను పరామర్శించేందుకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి బన్నీ రావద్దని అందులో పేర్కొన్నారు.
పుష్ప2 సినిమా ప్రీమియర్స్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే, బాలుడిని పరామర్శించేందుకు అనుమతి కావాలని పోలీసులను అల్లు అర్జున్ అనుమతి కోరారు. కానీ, అందుకు పోలీసులు నిరాకరించారు. ఒక వేళ పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ ఏదైనా సంఘటన జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
శ్రీతేజను బన్నీ పరామర్శించలేదంటూ చాలారోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, కేసు ఉండటం వల్ల తన లాయర్ల సూచనల మేరకు ఆ చిన్నారిని పరామర్శించలేకపోతున్నానని బన్నీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వెళ్లాలని ఉన్నా పోలీసుల అనుమతి లేకపోవడంతో ఆయనకు నిరాశే ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment